Suravaram Pratap Reddy

Suravaram Pratapa Reddy was born in a village in Mahbubnagar district. He had done a lot for reviving telugu language in Telangana.

సురవరం ప్రతాప రెడ్డి పేరు చెప్తే గోల్కొండ పత్రిక గుర్తు వస్తుంది. తెలంగాణ నుంచి వెలువడిన గోల్కొండ పత్రిక సామాజిక, సాహిత్య సేవ ఎంతో చేసింది. దీని సంపాదుడిగా సురవరం ప్రతాప రెడ్డి వ్యవహరించారు. తెలుగు జర్నలిజం పేరు చెప్తే తప్పకుండా గోల్కొండ పత్రికను స్మరణకు తెచ్చుకోవాల్సిందే. తెలంగాణలో కవులే లేరని ఎవరో అన్నందుకు ఆయన ఆగ్రహ భార్గవుడై 1940 ప్రాంతంలోనే గోల్కొండ కవుల ప్రత్యేక సంచిక వెలువరించారు. అందులో 350 మంది తెలంగాణా కవులను పరిచయం చేశారు. ఈ ప్రత్యేక సంచికను కొద్ది మంది భద్రంగా దాచి పెట్టారు. దీన్ని తిరిగి ముద్రించాల్సిన అవసరం వుంది. అంతటి నిర్మాణాత్మక క్రియాశీలి ప్రతాప రెడ్డి.

సురవరం ప్రతాప రెడ్డి కృషి ఫలితంగానే గోల్కొండ పత్రికకు అనుబంధంగా వచ్చే సుజాత పత్రికలో అనేక కథలు అచ్చు వేశారు. ఆ కాలంలో బూతు కథలని చెప్పి కోస్తా పత్రికలు తిప్పి కొడుతుంటే చలం కథలను సుజాత పత్రికలో అచ్చేశారు ప్రతాప రెడ్డి. అంత ధైర్యశాలి ఆయన. కథలు ఎలా రాయాలో తెలుసుకోవడానికే ప్రతాప రెడ్డి చలం కథలను సుజాతలో అచ్చేశారు. అంటే తెలంగాణ సమాజానికి, సాహిత్యకారులకు ఏం కావాలో కూడా ఆయన స్పష్టమైన అవగాహన వుండేదన్న మాట.

ఇదిలావుంటే, ఆయన స్వయంగా కథలు రాశారు. సురవరం ప్రతాప రెడ్డి కథలను ఆంధ్ర సారస్వత పరిషత్తు 1994-95 ప్రాంతంలో ఒక సంపుటిగా వెలువరించింది. ఆయన ఇరవై కథల దాకా రాశారు. సురవరం కథలు చదవడానికి ఇంపుగా వుంటాయి. దానికి తోడు ఆనాటి సామాజిక పరిస్థితులు, హిందూముస్లింల మధ్య గల సామరస్య భావనలు మనకు అవగతమవుతాయి. ఆయన రాసిన 'సంఘం పంతులు' అనే కథ కమ్యూనిస్టులు అడుగు పెట్టక ముందు సమాజంలో ఆంధ్ర మహాసభ కలిగించిన చైతన్యాన్ని తెలియజేస్తుంది. ''గ్యారా కద్దూ బారా కోత్వాల్‌'' అనే కథ నిజాం ప్రభుత్వంలోని అ­నీతిని బట్టబయలు చేస్తుంది. సురవరం 8 కథలతో 'మొగాలయి కథలు' సంపుటిగా వెలువడింది. ఈ పుస్తకం కూడా ఆంధ్ర సారస్వత పరిషత్‌లో దొరకుతుంది.

ఇక, ఆయన రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర పుస్తకం ఒక బృహత్తర అధ్యయనంతో రాసింది. ఆయన సునిశితి పరిశీలనకు, ­వేచనా శక్తికి ఇది అద్దం పడుతుంది. తెలుగు సమాజానికి సంబంధించిన అనేక చారిత్రక, సాంస్కృతిక ­షయాలు ఈ పుస్తకం చది­తే తెలుస్తుంది.

తెలంగాణ రచయితలు సురవరం ప్రతాప రెడ్డి మార్గాన్ని వదిలేయడం వల్ల నష్టపోయారని కొంత మంది వాదిస్తూ వస్తున్నారు. ఇప్పుడైనా తెలంగాణా రచయితలు తప్పకుండా సురవరం ప్రతాపరెడ్డిని చదువుకుని ఆయన మార్గాన్ని అనుసరించాలని వారంటున్నారు. తెలంగాణ తొలి తరం కథా రచయితల్లో బలమైన వాడు సురవరం ప్రతాప రెడ్డి.

Culture: